నేటి నుంచి మేడారం మినీ జాతర..

43
- Advertisement -

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం పండగ. నేటి నుండి మినీ మేడారం జాతర మొదలుకానుండగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది. సమ్మక్క-సారక్క పూజారులు మండమెలిగే పండగ (మినీ జాతర)ను నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండ మెలిగే పండగను నిర్వహిస్తారు.

మండ వెలిగే పండుగను పురస్కరించుకొని పూజారులు ఆయా గ్రామాల్లో గ్రామదేవతలు, బొడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా పూజారులు బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మామిడి ఆకులతో పాటు కోడి పిల్లను కట్టి తోరణాలు కడతారు.

జాతర నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగుపై గల జంట వంతెనలకు ఒకవైపు రూ.11.70 లక్షలతో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్నానఘట్టాలపై 350కి పైగా షవర్లను బిగించారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు రేకులతో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -