పాపం.. షర్మిలను ఎవరు పట్టించుకోవట్లే?

19
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఏపీకి షిఫ్ట్ అయిన వైఎస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడి పాలిటిక్స్ రసవత్తరంగా మారుతాయని భావించారంతా. కానీ ప్రస్తుత కానీ పరిస్థితులు చూస్తుంటే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ షర్మిలను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన ఏ పార్టీ కూడా వైయస్ షర్మిల విషయంలో పెద్దగా స్పందించడం లేదు. ఏపీలో జగన్ చంద్రబాబు పవన్ ముగ్గురు కూడా బీజేపీకి కొమ్ముకాస్తున్నారని.. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని తనదైన రీతిలో హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయ వేడి పెంచుతున్నారు షర్మిల.

కానీ షర్మిల వ్యాఖ్యలుపై టీడీపీ నేతలు గాని, జనసేన నేతలు గాని ఎవరు స్పందించడం లేదు. వైసీపీ నేతలు స్పందిస్తున్నప్పటికీ తీవ్రంగా పరిగణించకపోవడం గమనార్హం. దీంతో షర్మిలను ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదా అనే సందేహాలు రాక మానవు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండకపోవచ్చు అనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఆమెను ఆయా పార్టీల నేతలు లైట్ తీసుకుంటున్నట్లు వినికిడి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ మరియు టీడీపీ జనసేన కూటమి మధ్య ఉండే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ. అయితే షర్మిల కారణంగా వైసీపీ ఓటు బ్యాంకులో ఎంతో కొంత చీలిక రావడం మాత్రం కాయం. అందుకే షర్మిల విషయంలో వైసీపీ సీరియస్ అవుతుంటే.. టీడీపీ జనసేన పార్టీలు మాత్రం కూల్ గా ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఏపీ ఎలక్షన్స్ లో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

- Advertisement -