Congress:కూటమిలో శత్రువు.. కాంగ్రెసే?

6
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి అగ్నిపరీక్ష మొదలైందా ? కూటమినే నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్ గా మారిందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల వరకైనా కూటమి నిలుస్తుందా అనే సందేహాలు రాక మానవు. ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ని గద్దె దించే లక్ష్యంతో విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కూటమిలో మొదటినుంచి కూడా లోసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. కూటమిలో ఆధిపత్యం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. తామేం తక్కువ కాదు అన్నట్లుగా ఇతర పార్టీలు వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే పీఎం అభ్యర్థి విషయంలోనూ, సీట్ల పంపకాల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీతో ఆయా పార్టీలు విభేదిస్తూ వచ్చాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్.. వంటి పార్టీలు కూటమితో సంబంధం లేకుండా పంజాబ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాయి. ఇక తాజాగా జేడీయూ పార్టీ ఏకంగా ఇండియా కూటమి నుంచే బయటకు వచ్చేసింది. ముందు రోజుల్లో మరికొన్ని పార్టీలు కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఎన్నికల ముందే కూటమి కుప్పకూలుతుందా అనే సందేహాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కూటమిలో ఈ స్థాయి కల్లోలం ఏర్పడడానికి కాంగ్రెస్ వైఖరే కారణమనేది కొందరి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ నియంత ధోరణి కారణంగానే ఇతర పార్టీలు కూటమిలో ఈమడలేకపోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. మొదటినుంచి కూడా కూటమిలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఇతర పార్టీలను గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది హస్తం పార్టీ. దాని ఫలితమే కూటమిని ప్రశ్నార్థకంగా మార్చిందనేది అభిప్రాయం. మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకొని కూటమినే నిలుపుకునే ప్రయత్నం చేస్తుందా ? లేదా అనేది చూడాలి.

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

- Advertisement -