సర్జరీ చేయించుకుంది.. ఎదుగుదల ఏది ?

182
- Advertisement -

సారా అలీ ఖాన్ తన ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. కెరీర్ స్టార్టింగ్ లో సారా అలీ ఖాన్ బాగా లావుగా ఉండేది. తనకు సర్జరీ అవసరం బాగా ఉందని ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పుడు హిందీ సోషల్ మీడియాలో మరోసారి చర్చ మొదలైంది. తను అప్పట్లో ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో సారా అలీ ఖాన్ కూడా ఇప్పటికే వివరణ కూడా ఇచ్చింది.

ఇంతకీ సారా అలీ ఖాన్ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే.. “నేను బాగా లావుగా ఉండేదాన్ని. దాంతో చూడ్డానికి నేను అంత బాగుండే దాన్ని కాదు. లావు విషయంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. అప్పట్లో నేను ఒత్తిడిలో ఉండేదాన్ని. తగ్గడానికి చాలా కష్టపడ్డాను. ఎన్నో వర్కౌట్స్ కూడా చేశాను. అలాగే చిన్న సర్జరీ కూడా చేయించుకున్నాను. అది నా సొంత నిర్ణయం’ అంటూ సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చింది.

అయితే, సారా అలీ ఖాన్ సర్జరీ చేయించుకున్నా ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అసలు బాడీషేమింగ్ బాలీవుడ్ లో వెరీ కామన్ అయిపోయిందని.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నందువల్ల తనలాంటి వాళ్లపై ఎక్కువమంది దృష్టి పడుతోందని.. కాబట్టి తను ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకోను అని సారా అలీ ఖాన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -