బాబా రీ రిలీజ్..అదుర్స్!

158
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా 2002లో విడుదలైన చిత్రం బాబా. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న రజనీ నటన, సినిమా డైలాగ్‌లు ఇప్పటికి అందరిని ఆకట్టుకుంటాయి.

తాజాగా 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ రిలీజ్‌ కానుంది. ఇది కేవలం తమిళంలోనే. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ని రీ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమాలో కొన్ని సీన్స్‌ యాడ్‌ చేసినట్లు తెలుస్తుంది. సూపర్‌ నేచురల్‌ యాక్షన్ ఫిలిమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకు జోడీగా మనీషా కొయిరాల నటించింది. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లోటస్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రజనీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -