ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ..కేటీఆర్ హర్షం

447
cm kcr
- Advertisement -

దేశంలోనే ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు తెలంగాణలో లేవని కేంద్రం తన నివేదికలో పేర్కొంది. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ‌లో 967 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు ఉండేవ‌ని కానీ ప్రభుత్వం చేపట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డంతో రాష్ర్టంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించిందని ఈ సందర్భంగా మిష‌న్ భ‌గీర‌థ బృందానికి అభినందనలు తెలిపారు కేటీఆర్.

సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ‌లోని ప‌లు ప‌ల్లెల‌ను ఫ్లోరైడ్ ప‌ట్టిపీడించింది. ఫ్లోరైడ్ స‌మ‌స్య నుంచి విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారు.కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించింది. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికి మంచినీరు అందించడంతో ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పడింది.

- Advertisement -