ఐపీఎల్‌ 2020….కోహ్లీనే టాప్!

472
virat

సెప్టెంబర్ 19(రేపు) ఐపీఎల్ 2020 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో అన్నిజాగ్రత్తల మధ్య టోర్నిని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికం తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు.

అత్యధికంగా విరాట్ కోహ్లి రూ. 17 కోట్ల పారితోషికం పొందుతుండగా అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోహ్లి. విరాట్ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 15 కోట్లు, చెన్నై సారధి మహేంద్రసింగ్ ధోని రూ. 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.

శ్రేయాస్ అయ్యర్‌ను ఢిల్లీ జట్టు రూ. 7 కోట్లకు స్టీవ్ స్మిత్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. డేవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ రూ.12 కోట్లు, కేఎల్ రాహుల్‌ను పంజాబ్ రూ. 11 కోట్లకు రాహుల్‌ను కొనుగోలు చేసింది.