బిగ్ బాస్ 4…రేటింగ్‌లో టాప్!

213
bigg boss

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్‌ 4 సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. తొలివారం అంతగా ఆకట్టుకోకపోయిన రెండోవారం నుండి బిగ్ బాస్‌ని చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో బిగ్ బాస్ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.

నాలుగో సీజన్ ప్రారంభ వేడుకలకు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నాగార్జున. ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్‌ అన్నింటిలో హైఎస్ట్ రేటింగ్ అని తెలిపారు. తొలి రోజు బిగ్ బాస్‌ని 4.5 కోట్ల మంది వీక్షించారని, ప్రతి ముగ్గురిలో ఇద్దరి కన్ను ఇక్కడే పడిందని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. మీ అందిరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌‌కి 16.18 రేటింగ్ రాగా నాని హెస్ట్ చేసిన రెండో సీజన్‌ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక నాగార్జున రంగంలోకి దిగి మూడో సీజన్‌కు 17.9 రేటింగ్ రాబట్టారు. ఇప్పుడు దాన్ని మించి నాలుగో సీజన్‌లో చరిత్ర తిరగ రాశారు.