జిమ్ చేస్తున్నారా..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

23
- Advertisement -

నేటి రోజుల్లో జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కొందరైతే ఇంటివద్దే జిమ్ ఏర్పాటు చేసుకొని కసరత్తులు చేస్తుంటారు. ఇలా ప్రతిరోజూ జిమ్ చేయడం శరీరకంగా మానసికంగా మంచిదే. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే జిమ్ చేసేటప్పుడు కొంతమంది ట్రైనర్ సహాయం లేకుండా ఎలా పడితే అలా వ్యాయామాలు చేస్తుంటారు ఇలా చేయడం ఎంతమంత్రం మంచిది కాదని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్ చేసేటప్పుడు అలాగే చేయడానికి ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు సూచనలు పాటించడం మంచిదని చెబుతున్నారు..

సాధారణంగా చాలా మంది ఉదయం పూట పడగడుపున జిమ్ చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పడగడుపున జిమ్ చేయడం వల్ల పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశముంది. కాబట్టి ప్రోటీన్ జ్యూస్ గాని లేదా పండ్ల రసం గాని సేవించి జిమ్ కు వెళ్లాలని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇక కొంతమందికి జిమ్ చేసేటప్పుడు తరచూ దాహం వేస్తుంది. అయినప్పటికి అలాగే కంటిన్యూ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మైకం కమ్మే అవకాశం ఉంది. కాబట్టి జిమ్ చేసేటప్పుడు ప్రతి పదినిముషాలకు ఒక గ్లాస్ నీరు తాగడం మంచిదట.

ఇంకా జిమ్ కు వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులను ధరించి వెళ్ళడం చాలా బెటర్. సౌకర్యవంతమైన దుస్తుల కారణంగా ఫ్లెక్సిబుల్ గా వ్యాయామం చేసే వీలు ఉంటుంది. ఇంకా కొంతమంది జిమ్ లో ఎవరి ప్రమేయం లేకుండా ఎడాపెడా బరువులు ఎత్తుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్ తో పాటు ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిమ్ లో ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, ట్రైనర్ సూచనల మేరకు వ్యాయామ భంగిమలు పాటించడం వంటివి చేయాలి. ఇలా కొన్ని సూచనలు జాగ్రత్తలు పాటించడం వల్ల జిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

- Advertisement -