ఈసారి చేప ప్రసాదం పంపిణీ లేదు: బత్తిని బ్రదర్స్

366
bathini
- Advertisement -

హైదరాబాద్ చేప ప్రసాదం పంపిణీ గురించి తెలియని వారుండరూ. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ పెద్ద ఎత్తున జరగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తరలివస్తారు. అయితే ఈ సారి చేప ప్రసాదం పంపిణీ ఉండబోదని తెలిపారు బత్తిని బ్రదర్స్.

ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న నేపథ్యంలో చేపమందు పంపిణీని ఈ సారి చేయడం లేదని తెలిపారు. ప్రజలంతా దీనిని గమనించాలని కోరారు. తమ పేరుతో ఎవరైనా చేప మందును పంపిణీ చేస్తామని వస్తే వాటిని నమ్మవద్దన్నారు.

బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. బత్తిని వీరన్న గౌడ్, శివరాంగౌడ్‌ నుంచి ఈ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. వీరి మూడో తరమైన శంకరయ్య గౌడ్‌ హయాంలో పంపిణీ బాగా ప్రాచుర్యం పొందింది.

నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.

 

- Advertisement -