కొత్తజీవితంలోకి దిల్ రాజు..

286
dil raju
- Advertisement -

కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు నిర్మాత దిల్ రాజు. నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఆదివారం రాత్రి ఆయన రెండో వివాహం చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప‌దిమంది కుటుంబ స‌భ్యుల సమక్షంలో దిల్ రాజు పెళ్లి జరిగినట్లు సమాచారం.

2017లో దిల్ రాజు మొదటి భార్య చనిపోయారు. వీరిద్దరికి ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన సొంత బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అఫిషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు దిల్ రాజు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నారు. ఇలాంటి సమయంలో వృత్తిపరంగా అంత త్వరగా కోలుకోలేము. అయితే త్వరలోనే అంతా సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నా అని దిల్ రాజు పేర్కొన్నారు.

- Advertisement -