మొక్కలు నాటిన నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్..

296
Nizampet Municipal Commissioner
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ బి గోపి ఐఏఎస్ ఈరోజు నిజాంపేటలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం భావితరాలకు ఒక గొప్ప వరం, దూర దృష్టితో భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని, పెరుగుతున్న కాలుష్య భూతాన్ని నివారించడానికి చేపట్టిన కార్యక్రమం హరిత హారం.

అలాంటి కార్యక్రమానికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి అనతి కాలంలోనే ప్రజల్లో గొప్ప చైతన్యం కల్గించింది. అడవులను దత్తత తీసుకునే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, తనలోని ప్రకృతి ప్రేమను చాటుకున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని తన స్నేహితులను, సహచరులు భాగస్వామ్య కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -