ఎంపీ అరవింద్‌ పై బీజేపీ నేతల ఫైర్..

64
- Advertisement -

తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. అరవింద్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 13మండలాల అధ్యక్షులను మార్చారని …నిజామాబాద్ పార్లమెంట్ లో‌ సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అర్వింద్ అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన ముఖ్యనాయకులు,కార్యకర్తలు.

Also Read:ఏమిటో.. ?ఈ దైవాంశ సంభూతుడు!

- Advertisement -