ఏమిటో.. ?ఈ దైవాంశ సంభూతుడు!

56
- Advertisement -

‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో బ్రహ్మానందం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ”పవన్ కళ్యాణ్ ఎంతటి మంచి మనిషి అంటే, ఆయన నవ్వు మీరంతా చూసే ఉంటారు. పత్తి కాయ పగిలి తెల్లటి పత్తి బయటకు వచ్చినట్టు ఆ తెల్లదనంలో ఎంతటి స్పష్టత, అందం ఉంటుందో.. అంత అందంగా ఉంటుంది పవన్ నవ్వు. మనిషి అంతా మంచితనం. ఏ రకంగా మనం ఆయన దగ్గరకు వెళితే, ఆ రకమైన దర్శనం ఇవ్వగలిగిన దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్” అని బ్రహ్మానందం కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ పై అటు వైసీపీ వారు, ఇటు టీడీపీ వారు కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు అయితే, మరి ఇక సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏమనాలి ? అనేది టీడీపీ వారు మాట. అలాగే నిజమైన దైవాంశ సంభూతుడు వైఎస్సార్ అంటూ వైసీపీ వారు చెబుతున్న మాట. ‘ఏమిటో.. ? ఈ దైవాంశ సంభూతుడు’ పదం చుట్టూ ఇప్పుడు ఆంధ్ర రాజకీయం తిరిగేలా ఉంది. అయినా, ఒక మనిషిని దైవాంశ సంభూతుడు అనాలి అంటే.. ఎంత దైర్యం కావాలి ?, ఛాన్స్ లు తగ్గాక, బ్రహ్మానందంకి పవన్ కళ్యాణ్ లో దైవాంశ సంభూతుడు కనిపిస్తున్నాడు గానీ, అంతకు ముందు పవన్ ను జస్ట్ ఒక హీరోగానే బ్రహ్మానందం చూసిన మాట నిజం కాదని చెప్పగలమా !!.

Also Read:కోలీవుడ్ టార్గెట్‌గా పవన్‌ వ్యాఖ్యలు!

బ్రహ్మానందం సంగతి ఇలా ఉంటే.. బ్రో మూవీ ప్రీ రిలీజ్‌లో పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘త్రివిక్రమ్, నాకు మధ్య ఎక్కువగా సాహిత్యం, సైన్స్ గురించి చర్చ ఉంటుంది. ఆయన M.Sc న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. నీ స్నేహితుడిని చూపించు, నువ్వు ఏంటో చెప్తాం అంటారు. నాకు త్రివిక్రమ్ స్నేహితుడు. ఆయనను నేను ఎప్పుడూ గురువు స్థానంలో పెడతాను’ అని పవన్ అన్నాడు. దీంతో రాజకీయాల్లో స్పీచ్ లు రాస్తాడు కాబట్టే.. త్రివిక్రమ్ ను గురువు అంటున్నాడు అంటూ వైసీపీ ఫాలోవర్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read:బ్రో’ కంటతడి పెట్టిస్తుంది: పవన్

- Advertisement -