నివేదా థామస్.. నాని నటించిన జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ మళయాళ బ్యూటి మరోసారి నాని సరసన నిన్నుకోరి అనే చిత్రం చేసింది. ఈ చిత్రంలో నివేదా థామస్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్‌తో జతకట్టింది. ఇందులోను నివేదా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. తాజాగా నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న శ్వాస అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారించి. తన సోదరులతో కలసి ఓ వివాహ వేడుకలో నివేదా ఈ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుదేవా హీరోగా వచ్చిన ‘గులేబకావళి’ తమిళ చిత్రంలోని పాటకు నివేదా డ్యాన్స్ చేసింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్న ఆమె, “మీరు పార్టీని ఎలా ఎంజాయ్ చేస్తారు? మీ హీల్స్ ను విసిరేయండి. వెళ్లి డ్యాన్స్ చేయండి” అని వ్యాఖ్యానించింది. ఇక నివేదా డ్యాన్స్ అద్భుతమని కామెంట్లు వస్తున్నాయి. మరి అలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి..!
How to enjoy a party? Throw your heels away and get dancing! #bridesquad 🤟🏼 #orkeepthemonifyalike 😉 pic.twitter.com/sfJEMKOpEK
— Nivetha Thomas (@i_nivethathomas) November 25, 2018