కళ్యాణ్ రామ్‌…118

208
kalyan ram
- Advertisement -

నా నువ్వేతో రొమాంటిక్ హీరోగా ముద్రవేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం కెవి గుహన్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన కళ్యాణ్ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. 118 అనే టైటిల్‌ని సినిమాకు టైటిల్‌గా పరిశీలిస్తున్నారట.

ఈ నెంబ‌ర్ క‌థ‌కి ముడిప‌డి ఉండ‌డం వ‌ల‌న ఆ నెంబ‌ర్ పెడితే జ‌నాల‌కి తొంద‌ర‌గా క‌నెక్ట్ అవుతుంద‌ని టీం భావిస్తుంద‌ట‌. అందుకే ‘118’ ని టైటిల్‌గా ఫిక్స్ చేయాల‌ని యూనిట్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. కళ్యాణ్‌ రామ్ 16వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -