భారత సినిమాకు గర్వకారణం 2.0:రజనీ

212
2.0 pressmeet
- Advertisement -

భారతీయ సినిమాకు గర్వకారణంగా రోబో 2 చిత్రం నిలవబోతుందన్నారు సూపర్ స్టార్ రజనీ కాంత్. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన రజనీ నాలుగేళ్ల క్రితం శంకర్ వచ్చి స్టోరీ చెప్పగానే ఓకే చెప్పానని తెలిపారు. శంకర్ ఓ మెజీషియన్‌ అని ఆయన అడిగినవన్ని అందించిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పారు.

బాహుబలి సినిమా విజయానికి కారణం సబ్జెక్ట్ అని 2.0 కూడా మంచి సబ్జెక్ట్‌తో కూడిన చిత్రమన్నారు. టెక్నాలజీ అండ్ త్రీడీ హంగులు, అందుకు తగ్గ సబ్జెక్ట్ తో వస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. ఈ సినిమాకు ప్రచారమే అవసరం లేదని…సినిమా చూశాక ప్రేక్షకులే ప్రమోట్‌‌ చేస్తారని చెప్పారు.

తన ఫస్ట్ మూవీ అపూర్వ రాగంగళ్ విడుదలైనప్పుడు చూడాలని ఎంత ఆతృతతో ఎదురు చూశానో, ఈ సినిమా కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా..బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -