పవన్‌ మూవీ సెట్‌లో నిత్యామీనన్‌ సందడి..!

39
pawan

హీరోయిన్ నిత్యామీనన్ దక్షినాది భాషల్లో మంచి క్రేజ్ ఉంది. సహజత్వానికి దగ్గరగా పాత్రను తీసుకెళ్లడం ఆమెకి బాగా తెలిసిన విద్య. అందువలన ఆమె నటనను ఇష్టపడే అభిమానులు చాలామందినే ఉన్నారు. అలాంటి నిత్యామీనన్ కి ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే తాజాగా నిత్యామీనన్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. పవన్‌ ఈ నెల రెండో వారం నుంచి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఆయనకు జోడీగా నటించనున్న నిత్యామీనన్‌ కూడా ఈ నెల 12 నుంచి సెట్‌లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. పవన్‌తో నిత్యామీనన్‌ చేస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో మరో కీలక పాత్రలో రానా, ఆయనకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తున్నారు.