భర్తతో పబ్లిక్‌గా శ్రియ‌ రొమాన్స్‌.. నెటిజన్లు ఫైర్‌..

139
- Advertisement -

శ్రియసరన్ అనే పేరు కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది. వరస సినిమాలు చేసి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అందర్నీ కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్లుగా తన ఫిజిక్ కాపాడుకుంటూ ఔరా అనిపిస్తుంది. ఈ మధ్యే తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం ఆయనతో కలిసి ట్రిప్‌లో ఉంది. భర్తతో ఉన్న ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా త‌న అందాల‌ను కెమెరా ముందు ఉంచింది శ్రియ‌. ఇంట్లో నాలుగు గోడల మధ్య చేయాల్సిన రొమాన్స్ బయట చేస్తూ అందరికీ పబ్లిక్ షో చేస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇవి చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరీ ఇంత పబ్లిక్ గా రెచ్చిపోతున్నావేంటి శ్రియా అంటూ అడుగుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు శ్రియ వీడియోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -