36 కోట్ల టీకాలు…43 కోట్ల కరోనా టెస్టులు

53
India Corona cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో 43,733 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 930 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,06,63,665కు పెరగగా 2,97,99,534 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులుండగా 4,04,211 మంది మృతి చెందారు.

జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరగగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.29శాతానికి తగ్గగా మొత్తం 36.13 కోట్ల డోసులు టీకా డ్రైవ్‌లో పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.