డబ్బింగ్‌లో నితిన్ భీష్మా..

556
nithin

ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. నితిన్ సరసన రష్మీక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇటీవలె విడుదల చేసిన నితిన్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది. ఇవాల్టీ నుంచే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు నితిన్.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్లే బాయ్ గా కనిపించనున్నాడు నితిన్. క్రిస్మస్‌ కానుకగా ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.