మాదాపూర్‌లో సూర్య బందోబస్త్…ప్రీ రిలీజ్

398
bandobasth

రంగం ఫేమ్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ బందోబస్త్. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13న(రేపు) సాయంత్రం 6 గంటలకు మాదాపూర్ ఐటీసీ కోహీనూర్‌లో మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,హీరో సూర్య,ఆర్యతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, కథా నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.