జూన్‌ 16 తర్వాతే రుతుపవనాల ఆగమనం..

693
south west monsoon
- Advertisement -

ఈ ఏడాది సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఫోర్ కాస్ట్ ఆఫ్ మాన్సూన్ ఆన్ సెట్ – 2020పై ప్రసంగించిన జర్మనీ ప్రొఫెసర్ ఎలీనా సురోవ్యాట్కినా…తెలంగాణకు నైరుతి రుతుపవనాలు జూన్ 16 నుంచి 24 మధ్య వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

జూలైలో కొద్దిరోజులే వర్షాభావ పరిస్ధితులు ఉన్నా ఆ తర్వాత జోరందకుంటాయని వెల్లడించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 854 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం… తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ,రేపు రాష్ట్రంలోని పలుచోట్ల ఊరుములు,మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -