దేశ చరిత్రలోనే తొలిసారి…

378
Nirmala
- Advertisement -

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్‌. ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశ చరిత్రలో పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా ఒక మహిళ ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ఇదే. 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ జనరంజకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నవభారత ఎజెండాకు ప్రధానమంత్రి రూపమిచ్చే అవకాశముంది. వ్యవసాయం, రైతులు, ఉద్యోగ కల్పన, జీడీపీ పురోగతిపై ఈ బడ్జెట్‌లో ప్రధాన్యాంశాలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గృహరుణాల వడ్డీకి మరింత ఐటీ రాయితీ,ఉపాధి పెంపు మార్గాలపై ప్రత్యేక దృష్టి,మధ్యతరగతి వినియోగం పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండనున్నట్లు అంచనా.

దీంతో పాటు చిన్న, మధ్య శ్రేణి వ్యాపారులకు ఊరట కల్పించడం,రైతాంగ, గ్రామీణ దుస్థితిని తీర్చే ప్రణాళిక బడ్జెట్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద రైతుకు నేరుగా రూ 6000 నగదు బదిలీకి కోట్లాది రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాక- వ్యవసాయరంగాన్ని ఆదుకొని 2022కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయమని కొన్నేళ్లుగా మోదీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో వేచి చూడాలి.

- Advertisement -