రైతు వ్యతిరేక బడ్జెట్‌…

61
- Advertisement -

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా రైతు వ్యతిరేకిగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధుల్లో భారీగా కోతలు పెట్టారని మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. ఎప్పటి లాగానే ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు.

పేదలకు అన్యాయం చేస్తూ పెద్దలకు దొచిపెడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే రికార్డు స్థాయిలో అప్పులు చేశారని..తద్వారా దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. విద్య వైద్యం రంగాలకు కేంద్రం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి నాటి విభజన హామీలను మరోసారి తుంగలో తొక్కారని అన్నారు. ఏ ఒక్క రంగానికి కేంద్రం సరైన న్యాయం చేయలేదని ఇదొక భ్రమల బడ్జెట్‌ అని అన్నారు. రాష్ట్రాలకు ఏలాంటి ప్రోత్సహాకాలు ఇవ్వకపోవడం దారుణమని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

ఇవి కూడా చదవండి…

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

పారదర్శకంగా అసెంబ్లీ సమావేశాలు…

కేంద్ర బడ్జెట్…ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

- Advertisement -