నిర్భ‌య దోషుల‌ ఉరిశిక్షపై సినీ ప్రముఖుల హర్షం..

584
Preity Zinta
- Advertisement -

ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్‌సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలువురు సినీ ప్రముఖులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘ఎట్టకేలకు నిర్భయ కేసుకు ముగింపు పలికారు. ఈకేసులో తీర్పురావడం ఆలస్యం అయినా దోషులకు శిక్ష పడటం ఆనందానే ఉంది. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి లభించింది’ అంటూ #Justicedelayed హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది ప్రీతీ జింటా. మరో ట్వీట్‌లో.. ‘దోషుల‌ని 2012లోనే ఉరితీసినట్లైతే మహిళలపై క్రైమ్ జరగకుండా ఉండేది. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని అదుపులో ఉంచుకోవడం కంటే.. నివారించడ‌మే మార్గం. మహిళలకు న్యాయం చేయడంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఇదే మంచి సమయం’ అని ఎంతో ఎమోష‌న‌ల్‌గా ట్వీట్ చేసింది ప్రీతి.

సుస్మితా సేన్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. నిర్భ‌య త‌ల్లి పోరాటానికి న్యాయం జ‌రిగింది. చివ‌రికి అన్యాయం పోడింద‌ని తెలియ‌జేసింది. ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత పీవీపీ త‌న ట్విట్ట‌ర్‌లో .. “ధర్మ సంస్థాపనాయ సంభావామి యుగే యుగేష‌. ఏడేళ్ల శని వదిలింది. చరిత్రలో నిర్భయ, దిశ మళ్ళీ పునరావృతం కాకూడదు. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -