విత్తనాల సరఫరాకు పక్కా ప్రణాళిక..

205
Minister Niranjan Reddy
- Advertisement -

వానాకాలం సాగుకు విత్తనాల సరఫరాపై రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు హాజరైయ్యారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విత్తనాల సరఫరాకు పక్కా ప్రణాళిక రూపొందించాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. విత్తనాల సరఫరా చురుగ్గా జరగాలని..వానపడితే రైతులు ఆగే పరిస్థితి ఉండదని.. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో సరిపడా విత్తనాలు ఉండాలి. విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో పెట్టింది క్లస్టర్ల వారీగా ప్రతి రోజూ వివరాలు నమోదు చేయాలి. ప్రధానమైన విత్తన కంపెనీలతో ప్రతి రోజూ సమాచారం సేకరించండి అని అధికారులను ఆదేశించారు.

సన్నాలలో తెలంగాణ సోన సాగును ప్రోత్సహించండి. మధుమేహం రోగులకు తెలంగాణ సోన మేలుచేస్తుంది. అందుకే ప్రభుత్వం తెలంగాణ సోన సాగును ప్రోత్సహిస్తుంది. దీనిని భారీగా సాగుచేసేలా రైతులను చైతన్యం చేయాలి. ఈ వానకాలంలో 4 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ సన్నాహాలు చేస్తోందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -