కాంగ్రెస్ నేతలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..

210
Jagadish Reddy
- Advertisement -

రైతుకు గిట్టుబాటు ధర రావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుంది..నియంత్రిత సాగుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను కూడా రాజకీయం చెయ్యాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ రోజు భోనగిరిలో జరిగిన నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో దుయ్యబట్టారు.

పదవులు లేక కాంగ్రెస్ నాయకులు పిచ్చి పట్టి భగవత్ గీత చదువుతున్నారు. పదవుల ఆశలతో వారు వైరాగ్యంలో ఉన్నారు. వ్యవసాయంపై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని మంత్రి ఎద్దేవ చేశారు. డిమాండ్ ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలి. రైతులు ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గు చేటు అని మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శించారు.

- Advertisement -