అక్రమార్కులను సహించం- నిరంజన్ రెడ్డి

278
minister niranjan reddy
- Advertisement -

యూరియా పంపిణీలో అక్రమాలు జరిగాయని మీడియాలో వచ్చిన వార్తలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని యూరియా రవాణా చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడొద్దని నిత్యం యూరియా రవాణాకు సంబందించి మానిటరింగ్ చేస్తున్నాం. పాయింట్ ఆఫ్ సేల్ (పాస్) ద్వారా ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నా అక్రమాలు జరిగాయన్న వార్తలపై సీరియస్ అయ్యారు మంత్రి. యూరియా పక్కదారి పట్టాయన్న వార్తలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి అదేశాలు జారీ చేశారు అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోండి. విధుల పట్ల నిర్లక్ష్యాన్ని, రైతుల పట్ల బాధ్యతలేని తనాన్ని సహించేది లేదు. ప్రభుత్వ లక్షాలకు తూట్లు పొడిచే వారిపట్ల కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -