ఉత్కంఠ రేపుతున్న ‘ఆవిరి’ ట్రైలర్‌..

487
aviri
- Advertisement -

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 1న విడుద‌ల‌కానుంది.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. చిన్న పాప మిస్ అవడం, ఆమెని ఆత్మ తీసుకెళ్లిపోయిందనుకుని ఫిక్స్ అవడం.. పాప మళ్లీ మళ్లీ ఎస్కేప్ అవడం.. ఆమెని కనిపెట్టడానికి వచ్చిన వాళ్లు ప్రమాదాలకు గురి కావడం.. ఇలా ఉత్కంఠతగా ఉంది ట్రైలర్.. ఫస్ట్‌లుక్‌‌తోనే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే రిలీజ్ డేట్ అయిన నవంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే!

- Advertisement -