కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..

70
- Advertisement -

తెలంగాణ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ఇచ్చింది ఎన్నికల సంఘం. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ…జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని సూచించింది. దీంతో 20న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

రైతు రుణమాఫీ,ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం కేబినెట్ భేటీ శనివారం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక,రైతుల సమస్యలు,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించాలని భావించిన తాజాగా ఈసీ ఆదేశాలతో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం లేదు.

Also Read:22 వరకు వెయిట్ చేయాల్సిందే!

- Advertisement -