మరో మూడు రోజులు వర్షాలు..

221
rains tn telangana
- Advertisement -

ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అల్పపీడనం ఈరోజు ఉదయం బలహీనపడింది.అయినప్పటికీ దీనికి అనుబంధముగా 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

తూర్పు-పశ్చిమ shear zone Lat.20.0 deg.N వెంబడి మధ్య భారతదేశం మీదుగా 4.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా రేపు(ఆగస్టు 19 వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.రాగల మూడురోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఈరోజు మరియు రేపు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -