9 సినిమాలతో వస్తున్న ఏషియన్ సినిమాస్!

118
narayanadas

టాలీవుడ్‌లో నిర్మాతగా,ఎగ్జిబిటర్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించకున్న నారాయణ్ దాస్ నారంగ్‌ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిర్మాతగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఆయన తాజాగా 9 సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ నిర్మించిన లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా నాగార్జునతో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. దీనితో పాటు శరత్ మరార్ తో కలిసి నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో లక్ష్య చిత్రాన్ని నిర్మించారు

ఇక సుధీర్ బాబు హీరోగా, ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్థన్ తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దీనితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రాన్ని ప్రకటించారు. నిఖిల్ 20వ చిత్రాన్ని అలానే ‘మేజర్’లో నటిస్తున్న అడివి శేష్, శర్వానంద్, తమిళ నటుడు శివకార్తికేయన్ లతో కూడా సినిమాలను నిర్మించబోతున్నారు.

నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నారాయణ దాస్ నారంగ్, ఆయన తనయుడు సునీల్ నారంగ్… మహేశ్ బాబుతో కలిసి ఎ.ఎం.బి. మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వందల థియేటర్ల నిర్వహణ కూడా నారాయణదాస్ నారంగ్ చేతిలోనే ఉండటం విశేషం.