ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌..డేట్ ఫిక్స్‌!

80
rrr movie

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. తాజాగా సినిమా ఫస్ట్ సాంగ్‌ని ఆగస్టు 1 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్‌ని విడుదల చేసింది.

‘దోస్త్..’ అంటూ సాగే తొలి పాటను ఫ్రెండ్ షిప్ డేను పుర‌స్క‌రించుకుని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ థీమ్‌ సాంగ్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన‌గా, రీసెంట్‌గానే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించారని సమాచారం. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.