ఇష్టమైన వ్యక్తితో అది చేస్తా….

178
Nikishapatel

పవన్‌కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ నికిషాపటేల్. ఆ చిత్రంలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పడటికీ సినీ పరిశ్రమ దృష్టిలో మాత్రం పడింది. ఒకరిద్దరు టాలీవుడ్ నిర్మాలతో పాటు మరో బాలీవుడ్ నిర్మాత కూడా ఆమెను తమ చిత్రంలో నటించాలని అప్పట్లో అడిగారట.

Nikishapatel
‘పులి’ సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టిన నికిషా ‘తలైవన్‌’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఎన్నమో ఏదో’, ‘కరైఓరం’, ‘నారదన్‌’ చిత్రాల్లో నటించింది నికిషా పటెల్‌. ప్రస్తుతం తమిళంలో ‘7 నాట్కల్‌’అనే చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ. గౌతం దర్శకత్వంలోని ఈ సినిమాలో శక్తి హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే నికిషా పటెల్‌ సాయి రాం శంకర్‌ హీరోగా నటించిన అరకురోడ్డులో హీరోయిన్‌గా నటించింది.

Nikishapatel
నికిషాపటెల్‌ తన చిత్ర విశేషాల గురించి ముచ్చటించింది.. ఎస్‌జే సూర్య దర్శకత్వంలోని ‘పులి’ సినిమా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నటించలేదు. చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ నటిస్తున్నా. త్వరలోనే పెద్ద హీరోలతో జతకడతానన్న నమ్మకం ఉంది. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించలేదు. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవన శైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని నికిషాపటెల్‌ ఈ సందర్బంగా తెలిపారు.