జనసేనకు ఓటేయండి:నిహారిక

89
niharika pawan

మెగాబ్రదర్ నాగబాబు డాటర్ కొణిదెల నిహారిక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు ఓటేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం సూర్యకాంతం సినిమా చేస్తున్న నిహా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పవర్‌స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.

పవన్ కళ్యాణ్ అసలు పేరు మీకు తెలుసా అంటూ ఫ్యాన్స్‌నుద్దేశించి ప్రసంగించిన నిహారిక… కొణెదల కళ్యాణ్ కుమార్ ఆయన మా నాన్నకు తమ్ముడు. నాకు బాబాయ్. ఆయన జనసేన పార్టీపెట్టిన ప్రచారంలో బిజీగా ఉన్నారు. నాకు ఆంధ్రలో ఓటు లేదు కాబట్టి.. మీరందరూ జనసేన పార్టీకి ఓటు వేయాలంటూ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపింది.

త్వరలో తాను జనసేన తరపున ప్రచారం చేస్తానని జనసేన పార్టీ సింబల్ గ్లాసుతో మంచి ఫొటో మెమొరీ ఉందని ఆ ఫొటోని ఎన్నికల ముందు షేర్ చేస్తానని తెలిపింది. ఇప్పటివరకు . రామ్ చరణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, బన్నీ, శిరీష్ ఇలా ఒక్కక్కొరుగా పవన్‌కు మద్దతుగా నిలవగా తాజాగా మెగాడాటర్ కూడా జనసేనకు జై కొట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలతో మెప్పించలేకపోయిన నిహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ సినిమాలో నటిస్తున్నారు. ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటించారు. మార్చి 23న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.