కాంగ్రెస్ పార్టీకి సొంత అభ్యర్థులే లేరా..? వలస పక్షులకే మొత్తం టిక్కెట్లా..?

342
congress ledr
- Advertisement -

మా తాతలు నేతులు తాగారు..కావాలంటే మీరు మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా..తయారయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి..100 ఏళ్ల పార్టీ అంటూ నిత్యం చంకలు గుద్దుకునే కాంగ్రెస్ పార్టీలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సొంత నేతలే కరువయ్యారా..? నిన్న రాత్రి పీసీసీ రిలీజ్ చేసిన లిస్టు చూస్తే ఆ పార్టీ దుస్థితి అర్థమౌతుంది.. ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా…అనే పాట లాగా…సెప్టెంబర్ లో ఓడిపోయిన నేతలందరికీ మళ్లీ మార్చిలో సీట్లు ఇవ్వడం పార్టీ పరిస్థితిని సూచిస్తోంది.. అలాగే పార్టీలో ఎలాంటి చరిత్రా లేని వారిని ఏరి కోరి టికెట్లు ఇవ్వడం ఆ పార్టీ దివాళా దిశగా వెళుతుందనడానికి సూచికగా చెబుతున్నారు..

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ లో జాయిన్ అయింది 2018 అక్టోబర్ నెలలో.. అప్పుడు ఖానా పూర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. ఇప్పుడు ఆయనకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు.. ఇక 2018 జూన్ లో పార్టీలో చేసి అత్యున్నత పదవి తీసుకుని ఘోరంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డికి మళ్లీ మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చారు.. పెద్దపల్లి నుంచి బరిలో నిలిచిన ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది కేవలం 3 రోజుల క్రితం..ఇక జహీరాబాద్ విషయానికి వస్తే …మదన్ మోహన్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు.. ఆయన సైతం 2018లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతనే.. ఆయన అలా చేరారో లేదో ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగం అధ్యక్షునిగా నియమించారు..

ఇక చేవెళ్ల స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించుకున్న విశ్వేశ్వర్ రెడ్డి సైతం ఆరు నెలలు కాలేదు కాంగ్రెస్ లో చేరి…అప్పుడే టికెట్ ఇచ్చేశారు.. మెదక్ బరిలో నిలబడ్డ అనిల్ సైతం ఆరునెలల క్రితమే కాంగ్రెస్ చేరారు..తొలిజాబితాలోని 8మందిలో ఐదుగురు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారే.. ఒక్క నియోజకవర్గం..అదీ తమ సొంత ప్రాంతం పరిధిలోనే ఓడిపోయిన ఈ నేతలు మొత్తం పార్లమెంటు స్థానంలో ఎలా గెలుస్తారన్నది ఆశ్యర్యంగా మారింది.. కాకపోతే టీఆర్ఎస్ మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుంది..

నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ లిస్టు ప్రకటించాకే టీఆర్ఎస్ లిస్టు ప్రకటించాలని భావించింది..కాంగ్రెస్ ఓటమి తర్వాత సమీక్షతో ఏదో బ్రహ్మాండమైన ప్లాన్ తో వస్తుంది అని భావించిన వారికి తొలి జాబితాతోనే తాము మారలేదు..మారము అని నిరూపించింది.. సీనియర్లంతా బరిలోకి దిగుతారేమో అని భావించిన టీఆర్ఎస్ నెత్తిన పాలుపోసినట్లే..ఇక మొత్తం 17 స్థానాల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని భావించొచ్చు.. పార్టీ పట్ల విధేయతలు లేని ఇలాంటి నాయకులకు..సంస్థాగతంగా బలం లేని ఇలాంటి జంపింగ్ జంపాగులకు టిక్కెట్లు ఇస్తే…వాళ్లు మళ్లీ పార్టీ మారరు అని గ్యారెంటీ ఏంటి..? అమ్ముడుపోరని రుజువేంటి అని పలువురు విశ్లేషిస్తున్నారు.. వీరికి ఓటు వేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందాఅని కూడా ప్రశ్నిస్తున్నారు..

- Advertisement -