మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ!

3
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీ హోదాలో నిధి తివారీ పనిచేస్తున్నారు.

అంతకుముందు విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా సేవలు అందించారు.2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. ఆమె స్వస్థలం వారణాసిలోని మెహముర్‌గంజ్. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించే ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్)గా పనిచేశారు.

ఇప్పటి వరకు ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉన్నారు – వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్చంద్ర షా. ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.

- Advertisement -