గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు

624
g srinivas naidu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్దోంది. తాజాగా ఏపీకి చెందిన కృష్ణా జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ.. మొక్కలు విస్తృతంగా నాటడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చనిఅన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

పచ్చదనానికి నిలయమైన ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భూగర్భ జలాలు కలుషితం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా రహదారుల వెంట చెట్లు తీసేయాల్సి వస్తే… కొట్టేసే ఒక్కో చెట్టుకి ఐదు చెట్లు నాటే ప్రయ‌త్నం జరుగుతోందన్నారు. గాలి కాలుష్యం తీవ్రమై… పాఠశాలలకి సెలవులు ఇచ్చే దశకిచేరిన దేశ రాజధాని దిల్లీ పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే మొక్కలు నాటడం, ఉన్న వాటిని సంరక్షించడమే మార్గమమని కోరారు. ఈసందర్భంగా ఆయన మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. 1.గొపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు 2.శ్రీమతి తానేటి వనిత 3.ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాలా వాసుబాబుకు మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

- Advertisement -