వెంకటేశ్ పుట్టిన రోజున వెంకీమామ విడుదల

209
venky mama

విక్టరీ వెంకటేశ్ , నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీమామ. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి నిర్మిస్తున్నారు. ఈమూవీలో నాగ చైతన్య సరసన రాఖి ఖన్నా, వెంకటేశ్ సరసన పాయల్‌ రాజ్‌పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఈ మూవీని సంక్రాంతికి తేదా క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

సంక్రాంతికి పోటీ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో క్రిస్మ‌స్‌కి రిలీజ్ చేయాల‌ని భావించారు. కాని అప్పుడు కూడా రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో చిత్రాన్ని వెంకీ బ‌ర్త్‌డే ( డిసెంబ‌ర్ 13) సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలువడనుందని తెలిపారు చిత్రబృందం.