గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే శేఖర్

208
sheaker Green Challeange

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్దోంది. గ్రీన్‌ ఛాలెంజ్ లో భాగంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించారు తిరువళ్లూరు మాజీ ఎమ్మెల్యే శేఖర్. ఈసందర్భంగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శేఖర్ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు . రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు . ఈ సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురిని 1) తైగర్ రాజ్ MLA మధురై 2) ఖాదిర్ MLA మంగుళూరు 3) హరి తమిళ సినిమా హీరో గార్లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.