- Advertisement -
కర్ణాటక బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్‌ఐఏ.నిందితుడి తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించింది ఎన్‌ఐఏ.
వాంటెడ్ పోస్టర్‌ను ఇవాళ రిలీజ్ చేయగా నిందితుడి ఆచూకీ తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు.
Also Read:ట్రంప్ పై నిక్కి మరో గెలుపు
రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చుని.. పేలుడుకు ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. దీని ఆధారంగానే నిందితుడి ఉహాచిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
- Advertisement -