ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

9
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీ ఎన్నికల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ డీసీలో తొలి విజయాన్ని నమోదుచేయగా వెర్మోంట్ రాష్ట్రంలో గెలుపొందింది. ప్రస్తుతం ట్రంప్‌కు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 893గా ఉండగా నిక్కీ హేలీకి 66 మంది డెలిగేట్ల మద్దతు ఉంది.

రిపబ్లికన్‌ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. మంగ‌ళ‌వారం జ‌రిగే ప్రైమ‌రీ ఎన్నిక‌ల‌ను సూప‌ర్ ట్యూజ్‌డే అనగా మార్చి 5న అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థి కోసం జ‌రిగే ప్రైమ‌రీ ఎన్నిక‌ల క్యాలెండ‌ర్‌లో ఓకే రోజు ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. దాన్నే సూప‌ర్ ట్యూజ్‌డే అంటారు.

Also Read:పవన్‌ – బాబు భేటీ..వారి గురించే చర్చ!

- Advertisement -