మూడో వ‌న్డే.. భార‌త్ విజ‌యల‌క్ష్యం 244

232
match
- Advertisement -

మౌంట్ మాంగనూయ్‌లో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో 49ఓవ‌ర్ల‌లో 243 పరుగుల‌కు ఆలౌట్ అయింది కివీస్ జ‌ట్టు. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆట‌గాళ్లు ప‌ది ప‌రుగుల వ‌ద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఆత‌ర్వాత తొలి ఆరు ఓవ‌ర్ల‌కే 2 మేజ‌ర్ వికెట్లు కోల్పోవ‌డంతో కివీస్ ప్లేయ‌ర్లు నిరాశ‌కు గురయ్యారు. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ , రాస్ టేల‌ర్ లు కొంచెం నిల‌క‌డ‌గా ఆడి స్కోరు చేశారు. వికెట్ కీపర్ టామ్ లాథమ్, రాస్ టేల‌ర్ ఇద్ద‌రూ అర్ధ సెంచ‌రీ పూర్తి చేశారు.

లాథమ్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రెండు వారాలుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత‌మైన బౌలింగ్, ఫిల్డింగ్ తో అద‌ర‌గొట్టాడు. భారత బౌలర్లు పరుగులను కట్టడి చేయడంతో పాటు కీలక సమయాల్లో కివీస్ భాగస్వామ్యాలను విడదీయడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించడకుండా అడ్డుకున్నారు. ఇన్నింగ్స్ ఆఖర్లో సెంచరీకి చేరువగా వచ్చిన టేలర్‌ను షమీ ఔట్ చేసి స్కోరు వేగానికి కళ్లెం వేశాడు.భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, పాండ్యా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.

- Advertisement -