టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

27
tsrtc

నూతన సంవత్సరం సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జనవరి 1న 12ఏళ్ల పిల్లలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొంది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఆదేశాలు జారీచేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు.

ఆ వయసు పిల్లలు తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ అధికారులు ప్రచారం కల్పించాలని సజ్జనాలు ఆదేశించారు. మరోవైపు సంక్రాంతికి ప్రత్యేక బస్సుల్లో ఏపీ ఆర్టీసీ 50శాతం అదనపు ఛార్జీలు పెంచగా.. టీఎస్ఆర్టీసీ మాత్రం ఛార్జీలు పెంచడం లేదు.

ఓ వైపు తీవ్ర నష్టాలు, అప్పుల భారంతో కుదేలవుతున్నా తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు చేరువ అయ్యేందుకు ఎప్పటికప్పుడు వినూత్న నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్నారు సజ్జనార్.