పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం…

24
police

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ పరిసర కాలనీలో ఏసీపీ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ఈరోజు తెల్లవారుజామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలలోని ఇల్లిల్లు తిరుగుతూ వారిని కలిసి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అవగాహన కల్పించారు.

ప్రస్తుతం ఒమిక్రాన్ వెరియంట్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేసి నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్ చేశారు. నేరాల నియంత్రణకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని ఏసీపీ పేర్కొన్నారు. దీనిలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.