సక్సెస్‌ కోసం.. పరుగెత్తాల్సిందే !

318
Online News Portal
New study says running can enhance memory power
- Advertisement -

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో అనునిత్యం మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా జ్ఞాపకశక్తి మందగించడం జరుగుతుంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. ఎంత బాగా చదివినప్పటికీ పరీక్షలు వచ్చే సరికి మొత్తం మరిచిపోతున్నారు. ఆ మరుపు పరీక్షలంటేనే భయం వచ్చేలా చేస్తుంది. మరీ చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..? మీరు కష్టపడి చదివిన తర్వాత కొద్దిసేపు వేగంగా పరుగెత్తండంటున్నారు పరిశోధకులు.

ఈ అధ్యయనంలో బాగా చదివిన తర్వాత కూర్చొని కంప్యూటర్‌ గేమ్స్‌ వంటివి ఆడకుండా వేగంగా పరుగెత్తడం వంటి వ్యాయామం చేస్తే నేర్చుకున్న అంశాలు బాగా గుర్తుకు వస్తున్నట్లు కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా 16-29 ఏళ్ల వయస్సు గల 60 మందికి ఓ రూట్‌మ్యాప్‌ ఇచ్చి అందులోని జర్మన్‌-టర్కిష్‌ పదాలను నేర్చుకోమని సూచించారు.

Also Read:CMKCR:జూన్ 30న పోడు పట్టాల పంపిణీ

అనంతరం వారిని మూడు బృందాలుగా విడగొట్టారు. ఓ బృందం తీవ్రస్థాయిలో కంప్యూటర్‌ గేమ్‌ ఆడగా.. రెండో బృందం పరుగెత్తింది.. ఇక మూడో బృందం కొద్దిసేపు బయటి వాతావరణంలో గడిపింది. తర్వాత వారి జ్ఞాపకశక్తిని పరిశీలించగా.. పరుగెత్తిన వారు సమాచారాన్ని చాలా బాగా గుర్తుంచుకున్నారని కిండర్‌మ్యాన్‌ తెలిపారు. దీనికి గల కారణాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. మెదడులో కార్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్ ఉంటుంది. ఇదే మన జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి అద్భుతంగా గుర్తుపెట్టుకుంటుంది. కొన్ని సంధార్బాల్లో మెమోరీని ఖాళీ కూడా చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జీవితంలో చురుకుగా ఉంటూ మంచి విజయాలను సొంతం చేసుకోవాలంటే మేధోశక్తి చాలా అవసరం. అలాంటి మేధోశక్తిని కొన్ని నియమాలను పాటించడం వల్ల పొందవచ్చు.

Also Read:KTR:పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించాలి

- Advertisement -