తలా అజిత్‌కి ఏమైంది..

352
Ajith’s new bloody look
- Advertisement -

పోరాట దృశ్యాల్లో డూప్‌ లేకుండా నటించేందుకు ఇష్టపడే హీరోల్లో అజిత్ ఒకరు. ఎంతటి రిస్కీ షాట్‌ అయినా డూప్‌ను పెట్టేందుకు అంగీకరించని తత్వం ఆయనది. ‘బిల్లా-2’లో హెలికాప్టర్‌ గాలిలో ఎగురుతుండగా డోర్‌ బయట రాడ్డుపై నిలబడే సన్నివేశంలో ఎంతో ధైర్యంగా నటించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇలా డూప్‌ లేకుండా రిస్కీ షాట్స్‌ చేయడం వల్ల చాలా సార్లు గాయపడ్డారు కూడా. తాజాగా ఆయన నటిస్తున్న ‘వివేగమ్‌’లో కూడా అలాంటి పోరాట దృశ్యాల్లో అజిత్ నటిస్తున్నారు. ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా మారిపోతాయని చిత్రయూనిట్ చెబుతోంది.

తాజాగా అజిత్‌కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలైంది.  శరీరం నిండా గాయాలు, చిరిగిన చొక్కాతో అజిత్ కనిపిస్తున్న ఈ స్టిల్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.  మంచు దుప్పటి కప్పేసిన ప్రాంతంలో ఓ మడుగు… అదీ రక్తపు మడుగు! అందులో నుంచి మెల్లగా బయటకు నడుచుకొస్తున్న ఓ మనిషి… అతని శరీరమంతా రక్తపు చారలు, కాలిన గాయాలు. అయినా వీరోచితంగా పోరాడుతున్నాడు. సడన్‌గా ‘కట్‌’ అనే సౌండ్‌ వినిపించింది. వెంటనే ఫైట్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన అజిత్‌ రక్తపు మడుగు నుంచి కాస్త పక్కకు జరిగారు. అప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో  అజిత్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారట. ప్రస్తుతం బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది.

Ajith’s new bloody look

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌లో  సిక్స్‌ ప్యాక్‌తో అజిత్‌ను చూసిన ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. ఇప్పుడీ లేటెస్ట్‌ లుక్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. కమల్‌హాసన్‌ చిన్న కుమార్తె అక్షరా హాసన్‌ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. హిందీ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట!

57వ సినిమాగా వస్తున్న వివేగంకు సెంటిమెంట్‌నే ఫాలోఅవుతున్నాడు అజిత్. కొత్త సినిమా కథ వినడానికి, అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి, పూజా కార్యక్రమం నిర్వహించడానికి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడానికి, టీజర్‌, ట్రైలర్‌, ఆడియో విడుదల చేయడానికి, చివరికి సినిమాని విడుదల చేయడానికి … ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని గురువారమే జరగాలని అజిత్ కోరుకుంటారట. తాజా చిత్రం ‘వివేగం’లోను అజిత్ ఇదే సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నారు. ప్రతి షెడ్యూల్‌ను గురువారమే ప్రారంభించాలని దర్శకుడు శివకి చెప్పారట. ఆ ప్రకారమే అన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ను బల్గేరియా ప్లాన్ చేశారు. అజిత్ సెంటిమెంట్‌ ప్రకారం గత గురువారం షూటింగ్‌ ప్రారంభించారు.

- Advertisement -