పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ప్రధాని మోదీ,మమతా బెనర్జీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచేశారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పంచే డబ్బులు పట్టిస్తే…ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
డబ్బులు పంచి ఓట్లను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందని…బెంగాల్ ప్రజలారా? వాళ్ల ట్రాప్ లో పడొద్దు. డబ్బులు పంచే బీజేపీ నేతలను నిలదీయండి. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి. డబ్బులు పంచే బీజేపీ లీడర్లను పట్టుకున్న బెంగాల్ పౌరులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని ప్రకటించింది. మమతా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తీసుకొస్తున్నారని.. నా జీవితంలో మోదీ లాంటి అబద్దాల కోరు అయిన ప్రధానమంత్రిని చూడలేదన్నారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే. పశ్చిమ బెంగాల్ సంస్కృతిని నాశనం చేయడానికి వస్తున్నారని.. వాటిని నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని వెల్లడించారు.