కాంగ్రెస్‌లో చేరిన షకీలా..!

310
shakeela
- Advertisement -

తమిళనాడు ఎన్నికల వాతావరణం రోజురోజుకి హీటెక్కుతోంది. ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటి షకీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెబుతున్న షకీలా.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. తమిళనాడు కాంగ్రెస్ హ్యూమన్ రైట్స్ వింగ్ లో షకీలా పనిచేయనున్నారు.

కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో ఉండడం ద్వారా నా లక్ష్యం నెరవేరుతుందని షకీలా చెప్పుకొచ్చారు. షకీలా కాంగ్రెస్‌లో చేరవడంతో ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు.

- Advertisement -